ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిపక్షం…

Share Icons:
  • పార్లమెంట్ సమావేశాల సందర్భంగా
  • పాల్గొన్న 33 పార్టీలకు చెందిన 40 మంది నేతలు
  • నిబంధనల ప్రకారం అన్ని విషయాలు చర్చిస్తాo: -ప్రధాని

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేప‌టి నుంచి ప్రారంభం  పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన న్యూ ఢిల్లీ లో అఖిల పక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో 33 పార్టీలకు చెందిన 40 నేతలు పాల్గొన్నారు. దీనిలో వివిధ అంశాలను గురించి వివిధ పక్షాల నేతలు ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం అన్ని విషయాలు చర్చిద్దామని ప్రధాని అన్నారు. కోవిద్ లో మరణించిన వారికీ సమావేశం నివాళులు అర్పించింది. కేంద్ర ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంటులో  స‌మ‌స్య‌ల‌పై నిల‌దీసేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌ణాళిక‌లు వేసుకున్నాయి. క‌రోనాతో పాటు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవ‌క‌త‌వ‌క‌లు, చైనాతో ప‌రిస్థితులు, దేశంలో నిరుద్యోగం, ఆర్థిక ప‌రిస్థితులు వంటి అంశాల‌పై కేంద్ర స‌ర్కారుని ప్ర‌శ్నించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకుంది.

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదం నేప‌థ్యంలో కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన‌ గెజిట్ నోటిఫికేష‌న్ అంశాన్ని లేవ‌నెత్తాల‌ని టీఆర్ఎస్ నిర్ణ‌యించింది., విభ‌జన చ‌ట్టంలోని పెండింగ్ అంశాల‌ను ప్ర‌స్తావించాల‌ని వైసీపీ నిర్ణ‌యం తీసుకుంది. పోల‌వ‌రం నిధులు, విశాఖ ఉక్కు అంశాల‌పై కూడా ప్ర‌శ్నించ‌నుంది. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి, రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల అంశాల‌ను లేవ‌నెత్తాల‌ని టీడీపీ భావిస్తోంది. ఉద‌య‌దం 11 గంట‌ల‌కు పార్లమెంటు స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply