కిసాన్ సమ్మాన్ పథకం…ప్లాన్ మారింది…

Share Icons:

ఢిల్లీ, 14 ఫిబ్రవరి:

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద రైతులకు పంట సాయాన్ని ఇస్తున్న విషయం తెల్సిందే. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏటా రూ. 6వేల రూపాయల అందిస్తారు. రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లోకే జమచేస్తారు.

అయితే కేంద్రం ఆ ప్లాన్‌ను మార్చింది. ఎన్నికల లోపే రెండు విడతల మొత్తం రూ.4వేలని రైతులకు అందించాలని భావిస్తున్నారు. ఇక కేంద్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కిసాన్ యోజనను మోదీ ఫిబ్రవరి 24న ప్రారంభించనున్నారు.

ఈ పథకంతో దేశంలోని 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఇక  ప్రభుత్వ ఉద్యోగాలు కలిగిన ఉన్న రైతులు, పెన్షన్ పొందేవాళ్లకి ఈ పథకం వర్తించదు. కాగా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి కేంద్రం ఏటా రూ.75వేల కోట్లు కేటాయించనుంది.

మామాట: ఎన్నికల ముందు రైతులని ఆకర్షించడానికి…

Leave a Reply