ఏపీ రైతుల ఖాతాల్లోకి పి‌ఎం కిసాన్ డబ్బులు….

pm kisan money deposit on ap farmers bank accounts
Share Icons:

అమరావతి: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఏటా రూ. 6వేలు పి‌ఎం కిసాన్ పేరిట సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు విడతల్లో 2 వేలు చొప్పున సాయం చేశారు. ఇక కేంద్రం నుంచి నాలుగు వేలు రాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 7500 రైతు భరోసా పేరిట రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. ఈ క్రమంలోనే పి‌ఎం కిసాన్ ఆఖరి విడత డబ్బులని రైతులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. వాస్తవ సాగుదారులు, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, దేవాదాయ, ధర్మాదాయ భూముల్ని సాగు చేసుకుంటున్న వారు, ఇతర వర్గాల సాగుదార్లకు సొమ్ము అందజేయనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.

కాగా, డిసెంబర్ 1వ తేదీ నుంచి తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ రైతులకు క్రెడిట్ కాలేదు. 2019 చివరి విడత రూ.2,000 రైతులకు అందించనున్నారు. ఆధార్ కార్డుతో బ్యాంకు అకౌంట్ లింక్ చేసిన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నిధులు వస్తాయి. దేశం మొత్తం ఆరున్నర కోట్ల మంది రైతులు ఆధార్ – బ్యాంకు అకౌంట్ లింక్ చేసుకున్నారు. వీరికి ప్రయోజనం చేకూరనుంది.

ఇసుక డోర్ డెలివరీ

ఏపీలో ఇసుక డోర్ డెలివరీ సదుపాయం నేటి నుంచే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ఈ రోజు అమల్లోకి తీసుకురానున్నారు. మొదటగా కృష్ణా జిల్లాలో ఇసుకను డోర్ డెలివరీ చేయనున్నారు. ఇసుక కావాలనుకున్నవాళ్లు నిర్మాణానికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచి, మ్యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తే.. ఇసుక ఆ ప్రదేశానికి నేరుగా రానుంది. వినియోగదారులు బుకింగ్‌ కోసం అయ్యే ఖర్చు, రవాణా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం వరకు టన్ను ఇసుకకు కిలోమీటరుకు రూ.6.60 రవాణా ఛార్జీ చెల్లించాలి. 30 కిలోమీటర్ల దూరం అయితే కిలోమీటరుకు రూ.6, 30 కిలోమీటర్లకుపైన అయితే కిలోమీటరుకు రూ.4.90 చొప్పున ఛార్జీ చేయనున్నారు.

కాగా, జనవరి 7న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీలు చేయనున్నారు. ఆ తర్వాత జనవరి 20లోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను అమలు చేయాలని సీఎం జగన్ సంకల్పించారు.

 

Leave a Reply