సముద్రంలో కూలిన ఇండోనేషియా విమానం…!

Plane Carrying 188 Crashes Into Sea Minutes After Take-Off From Jakarta
Share Icons:

జకార్తా, 29 అక్టోబర్:

ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 188 మంది ప్రయాణికులతో జకార్తా నుంచి పినాంగ్ వెళుతున్న లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు.

ఈ నేపథ్యంలో విమానం సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. టేకాఫ్ అయిన 13 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. విమానం జాడ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ ఉదయం 6.33 నిమిషాలకు ఏటీసీతో విమానానికి సంబంధాలు తెగిపోయినట్టు ది స్ట్రెయిట్ టైమ్స్ తెలిపింది.

మామాట: ప్రయాణికుల్లో ఎవరైనా బతికి బయటపడ్డారా? అనే విషయం తెలియాల్సిఉంది…

Leave a Reply