అబ్బో పెట్రోల్ కొనలేము

Share Icons:

కొత్త ఢిల్లీ , ఆగస్టు28,

దేశ‌వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు మంగ‌ళ‌వారం రికార్డు స్థాయిలో పెరిగాయి. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన కార‌ణంగా దేశీయ చ‌మురు కంపెనీలు సైతం ఇంధ‌న ధ‌ర‌ల‌ను స‌వ‌రించాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని చమురు సంస్థలు జారీ చేసిన రోజువారీ ధరల నోటిఫికేషన్ ప్రకారం, డీజిల్ నేడు ఢిల్లీలో లీటరుకు రూ. 69.61 రూపాయలుగా ప‌లుకుతోంది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో మంగళవారం పెట్రోలు, డీజిల్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

న‌గ‌రం

పెట్రోలు ధ‌ర‌(రూ.)

డీజిల్ ధ‌ర (రూ.)

ఢిల్లీ 78.05 69.61
కోల్‌క‌త 80.98 72.46
ముంబ‌యి 85.47 73.90
చెన్నై 81.09 73.54
బెంగుళూరు 80.58 71.84
హైద‌రాబాద్ 82.75 75.72

మామాట: మళ్లీ అందరూ సైకిల్ తొక్కండయ్యా… ప్రభుత్వాలు దిగొస్తాయి… మీకూ ఆరోగ్యం

Leave a Reply