రికార్డు స్థాయికి పెట్రోధరలు

Share Icons:

ముంబై, సెప్టెంబర్ 07,

శుక్రవారం దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తుల ధరను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్సి) మళ్లీ పెంచాయి. శుక్రవారం పెట్రోలు, డీజిల్ ధరలు నాలుగు మెట్రో నగరాలలో గరిష్టంగా నిలిచాయి. ముంబైలో  పెట్రోలు ధర రూ. 87.39 ఉండగా, డీజిల్ ధర లీటర్ రూ. 76.51ఉంది. మొత్తం మీద పెట్రోలు లీటరుకు 0.48 పైసలు డీజలు లీటరుకు 0. 55 పైసలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర రికార్డు స్థాయిలో 79.99 రూపాయలకు పెరిగింది. డీజిల్ ధర లీటర్ రూ. 72.07 కు చేరింది. కోల్కతాలో పెట్రోలు ధర లీటరుకు 82.88 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు రూ. 74.92 కి పెరిగింది. అదేవిధంగా చెన్నైలో లీటరుకు పెట్రోల్ ధర 83.14 రూపాయలకు, డీజిల్ రిటైల్ ధర లీటరుకు రూ. 76.18 గా ఉంది.

గురువారం నాడు యుఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరోసారి రూ. 72.12 కి చేరినందున ఇంధన ధరలు మరింత పెరగడంతో బ్రెంట్ చమురు ధర 78 డాలర్ల వద్ద ఉంది. భారతదేశం వినియోగిస్తున్న ముడి చమురులో 80 శాతం దిగుమతి చేసుకుంటుంది,  పతనమైన భారత రూపాయి విలువ ఇంధన ధరల పెరుగుదలకు దారి తీస్తోందని నిపుణులు పేర్కొన్నారు.

మామాట:  మళ్లీ గాడిదలు, గుర్రాలు కొనుక్కోవాలా

Leave a Reply