పెట్రోలు ధరల్లో రాష్ట్రాల దోపిడీ

Meemaata lo maamaata Poll No 31
Share Icons:

 

 

కేంద్రం పెట్రోలు కంపెనీలపై నింద వేస్తుంది. కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ను నిందిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని ఆడిపోసుకుంటాయి. వెరసి పెట్రోలియం ఉత్పత్తులైన పెట్రోలు, డీజల్, గ్యాస్ ధరలు నియంత్రణ లేకుండా ఆకాశయానానికి తొందర పడుతున్నాయి. సమస్యను ఎవరు పరిష్కరిస్తారో ఏమో…?

 

[pinpoll id=”61228″]

 

పది సంవత్సరాలు పాలించిన యూపీఏ పాలనలో అనేక కుంబకోణాలు చోటు చేసుకున్నాయి. కానీ అప్పట్లో పెట్రో ఉత్పత్తుల ధరలు ఇంత దారుణంగా ఆకాశమార్గం పట్టలేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉన్నా, ఇప్పటితో పోల్చినపుడు దేశీయంగా పెట్రోలు, డీజల్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. కానీ బీజేపీ వంటి ప్రతిపక్షాలు పాలక పార్టీని విపరీతంగా విమర్శించాయి. ఆర్థిక వేత్త మన్మోహన్ సారథ్యంలో ధరల నియంత్రంణ ఇలాగేనా అంటూ నానా యాగీ చేశాయి. మరి ఇపుడు బిజేపీ పరిపాలనలో పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా లీటరుకు రూ. వంద మార్కు దాటేలా పైపైకీ పోటీ పడి దూసుకువెళుతున్నాయి. తాజా గా విజయవాడలో పెట్రోలు లీటరు ధర రూ. 86.72 కు చేరింది. కాగా 2014 యూపీఏ పాలనలో లీటరు పెట్రోలుపై రూ.9.2 ఉన్న ఎక్సైజ్ ఫన్ను  నేడు రూ.19.48 కి చేరింది.

అలాగే డీజల్ పై కూడా లోటరుకు రూ. 3.46 నుంచి రూ.15.33 కు పన్న భారం పెరిగింది. నిజానికి పెట్రో ఉత్పత్తులను జీఎస్ టి పరిథిలోకి తెస్తే, పన్నులు రూ. 15-18 వరకూ తగ్గే అవకాశం ఉందని పరిశీకులు భావిస్తున్నారు. రోజువారి ధరల పెంపునకు ఆయిల్ కంపెనీలకు అనుమతించిన కేంద్ర ఇపుడు పెట్రో ధరలఅదుపు మా చేతుల్లో లేదని తప్పుకుంటోంది. మరో వైపు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ  పరిధిలోకి తెస్తే అంగీకరించేది లేదని ఆంధ్ర ప్రదేశ్ వంటి చాలా రాష్ట్రాలు కేంద్రన్ని హెచ్చరించే పరిస్థితి. ఈ నేపథ్యంలో  ధరల పెరుగుదలకు ఎవరిని నిందించాలో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.

పెట్రో ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్   బంద్ పిలుపునకు మిగతా విపక్షాలు కూడా స్పందించాయి. డీఎంకే, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, జేడీఎస్ సహా మొత్తం 21 ప్రధాన పార్టీలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం కూడా బంద్‌లో పాల్గొంటున్నట్టు కాంగ్రెస్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటలకు బంద్ ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగుతుందని పేర్కొంది. సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఈ వేళలు నిర్ణయించినట్టు వివరించింది. కాగా, వామపక్షాలు మాత్రం విడిగా బంద్‌కు పిలుపునిచ్చాయి. తాము కూడా నిరసనల్లో పాల్గొంటామని తృణమూల్‌ కాంగ్రెస్‌ తెలిపింది. మరి ఏపీలో పాలక తెలుగు దేశం బంద్ కు మద్దతు ఇస్తోందా లేదా బహిర్గతం చేయలేదు. ఇక్కడ రెండు సమస్యలున్నాయి. బంద్ కు మద్దతు ఇస్తే  పెట్రోలు ఉత్పత్తులపై రాష్ట్రం విధిస్తున్న పన్నులను తగ్గుంచాలని ఇక్కడి ప్రతిపక్షాలు డిమాండు చేసే అవకాశం ఉంది. చేయకపోతే ప్రజలు పార్టీ తీరుపై అసంతృప్తి చేందే ఆస్కారం ఉంది. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు అడకత్తెరలో పోక లాగా నలుగుతున్నాయి.

అటు జీఎస్ టీ ఆలోచనను అడ్డుకుని, ఇటు పెట్రో ధరలపై ప్రజలకుసమాధానం చెప్పలేక రాష్టప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటో కనుగొనవలసింది ఎవరు. పెట్రో ఉత్పత్తుల వ్యవహారంలో వేలు పెడితే చేయి కాలుతుందని అటు కేంద్ర పాలకులకు ఇటు రాష్ట్ర పాలకులకు బాగా తెలుసు. వారిలో ఈ సందిగ్ధత తొలగేవరకు ప్రజల జేబులకు ఇలా చిల్లులు పడుతూ ఉండాల్సిందేనా?  క్రూడాయిల్ ధరలు తగ్గినా మనం ఆధికంగా చెల్లించవలసిందేనా, ఇదే భేతాల సమస్యలాగా మారుతోంది.

 

మాామాట:  వినియోగదారులు, ప్రజల్లో చైతన్యం వచ్చే వరకూ ఇంతే.. 

Leave a Reply