పెనమలూరు ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు…

Share Icons:

విజయవాడ, 18 మార్చి:

కృష్ణా జిల్లా పెనమలూరు. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గం(అంతకముందు ఉయ్యూరు) నుండి కాంగ్రెస్ తరుపున పార్థసారథి కేవలం 177 ఓట్ల తేడాతో టీడీపీ నేత చలసాని వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడ నుండి టీడీపీ నేత బోడే ప్రసాద్ సుమారు 31 వేల పైనే ఓట్ల తేడాతో సమీప వైసీపీ అభ్యర్ధి కుక్కల విద్యాసాగర్‌పై విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో బోడే ప్రసాద్ మళ్ళీ టీడీపీ నుండి పోటీ చేస్తుండగా…వైసీపీ నుండి పార్థసారథి పోటీ చేస్తున్నారు.

అయితే గత ఐదేళ్లలో పెనమలూరు విజయవాడ నగరానికి, రాజధాని ప్రాంతానికి దగ్గర ఉండటంతో అన్నీ రకాలుగా అభివృద్ధి పథంలో నడిచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ బాగానే అమలయ్యాయి. కానీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి. ఇసుక మాఫియా, కాల్ మనీ లాంటి స్కామ్‌లో బోడే కూడా ఉన్నారని ప్రతిపక్షాలు చేసిన  ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గతంలో ఇక్కడ నుండి గెలిచిన సారథి మంత్రి కూడా అయ్యారు. దీంతో ఈ నియోజకవర్గంపై ఆయనకి పట్టు ఉంది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకిత, జగన్‌కి పెరిగిన ప్రజాబలం తన గెలుపుకి దోహదపడతాయని భావిస్తున్నారు.

కాగా, ఇక్కడ ఓటర్లలో బీసీలు ఎక్కువ శాతం ఉంటారు. ఆ తర్వాత స్థానంలో ఎస్సీలు ఉంటారు. ఇక కమ్మ సామాజికవర్గం కూడా ఎక్కువే ఉన్నారు. అయితే ఈసారి పరిణామాల్లో పెనమలూరు ఓటర్లు ఎవరివైపు ఉంటారో చూడాలి.

మామాట: ప్రజానాయకుడు వైపు ఉంటారు…

Leave a Reply