కుటుంబ విలువలని తెలియజేసే పెళ్ళైన బ్రహ్మచారి చిత్రం…

Share Icons:

హైదరాబాద్, 27 మే:

కుటుంబ విలువలని తెలియజేస్తూ…వెరైటీ టైటిల్…మంచి కథతో తెరకెక్కుతున్న చిత్రం పెళ్ళైన బ్రహ్మచారి’.  కుటుంబ వ్యవస్థ బాగుంటేనే భావి తరాల భవిష్యత్తు బాగుంటుందనే మంచి ఉద్దేశ్యంతో నూతన దర్శకుడు జల్లు కుమార్ విశాలాక్షి ఫిలిం క్రియేషన్స్ బ్యానర్లో పెళ్ళైన బ్రహ్మచారి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 కుమార్ గతంలో అవార్డు పొందిన నా బంగారు తల్లి చిత్రాన్నికి సహాయ దర్శకునిగా పని చేశారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి అవసరమైన నటీనటులు, సాంకేతిక నిపుణులను కొత్తవారిని పరిచయం చేస్తూ, విశాలాక్షి ఫిలిం క్రియేషన్స్ టీమ్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులను సేకరిస్తున్నారు.

ఇక దీనికి స్వచ్ఛంద సంస్థలైన సేవ్ ఇండియన్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీస్ సహకారం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ నుండి 12 మంది నటీనటులను, అన్నపూర్ణ ఇంటరనేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా నుండి 10నుంది నటులను,  నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి ఇద్దరు నటులను ముఖ్యమైన పాత్రలకు ఎంపిక చేసుకున్నారు.

అయితే ఇంతవరకు ఏ భాషలోనూ రానటువంటి విభిన్న కథాంశంతో, కుటుంబ విలువలుగల నవరసాలతో ఈ చిత్రం తెరకెక్కనుంది.

మామాట: కుటుంబ చిత్రాలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు

Leave a Reply