బాలయ్య సరసన ఆర్‌ఎక్స్ 100 హీరోయిన్?

Share Icons:

హైదరాబాద్, 18 మే:

నందమూరి బాలకృష్ణ  హీరోగా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్లో గతంలో  వచ్చిన ‘జై సింహా’  హిట్ అయింది. మళ్ళీ  కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

ఈ సినిమాలో  బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో ఒక కథానాయికగా కన్నడ బ్యూటీ ‘హరిప్రియ’ పేరు వినిపిస్తోంది. రెండవ కథానాయికగా పాయల్ రాజ్ పుత్ పేరు తెరపైకి వచ్చింది. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో పరిచయమైన ఈ సుందరి, గ్లామర్ పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. ‘వెంకీమామ’ .. ‘డిస్కో రాజా’ సినిమాల్లో ఛాన్సులు పట్టేసింది.

కాగా, ఈసినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రతినాయక పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్న విషయం తెలిసిందే.

మామాట: ఊహించని కాంబినేషన్

Leave a Reply