పవన్‌ అప్పులు. రూ. 33 కోట్లు !

Share Icons:

విశాఖ, మార్చి 22,

ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన సారథి పవన్ విశాఖ జిల్లాలోని గాజువాక అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. నిబంధనల్లో భాగంగా తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. అఫిడవిట్లో పవన్ చూపిన లెక్కలు ప్రకారం ఆయన చరాస్థుల విలువ రూ. 12 కోట్లు ఉండగా స్థిరాస్తుల విలువ రూ.40.80 కోట్లు. ఆయన భార్యా బిడ్డల పేరు మీద రూ. 3.2 కోట్ల ఆస్తులున్నాయి. ఇక ఆయన అప్పుల వివరాలను చూస్తే ఆ మొత్తం రూ. 33.7 కోట్లు. ఈ మొత్తంలో చాలా వరకు వ్యక్తుల వద్ద తీసుకున్నదే కావడం గమనార్హం. అది కూడా సినీ నిర్మాణ సంస్థల వద్దే నుండే కావడం కొసమెరుపు.

వాటిలో హారికా హాసిని క్రియేషన్స్ వద్ద రూ. 1.25 కోట్లు, స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ వద్ద నుండి రూ.2.4 కోట్లు, బాలాజీ సినీ మీడియా వద్ద రూ.2 కోట్లు ఉండగా వదిన సురేఖ వద్ద రూ. కోటి ఋణం తీసుకున్నారట. మిగతావి బ్యాంకుల వద్ద నుండి తీసుకున్నవి. వీటికి సంబందించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మామాట: ఫరవాలేదు పవన్ లెక్కలు బాగున్నాయే..

Leave a Reply