Header Banner
Header Banner
TRENDING NOW

జగన్‌కు కౌంటర్ ఇచ్చిన పవన్…..

జగన్‌కు కౌంటర్ ఇచ్చిన పవన్…..

అనంతపురం, 6 డిసెంబర్:

ఇటీవల వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ వివాహాల గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ భారతీయ వివాహ వ్యవస్థను అపహాస్యం చేసిన వ్యక్తి అని, చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీలకు అమ్ముడుపోయిన వ్యక్తి అని జగన్ విమర్శించారు.

ఈ నేపథ్యంలోనే పవన్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత తనను వ్యక్తిగతంగా దూషించడం మాని అనంతపురం కరువుపై పోరాటం చేయాలని సూచించారు. అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై మాట్లాడాలని, గురువారం అనంతపురం కరువు, వలసలపై మీడియాతో మాట్లాడిన సందర్భంగా జగన్ వ్యాఖ్యలపై కూడా పవన్ స్పందించారు.

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

వైసీపీ నాయకులు జనసేనను గుర్తించకున్నా ఫర్వాలేదని, సమస్యలను గుర్తిస్తే చాలని పవన్ అన్నారు. జనసేన పార్టీ ఉన్నది వైసీపీ గుర్తింపు కోసం కాదని, ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అని గుర్తుచేశారు.

అధికార పార్టీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని అసెంబ్లీకి వెళ్లమంటే ఎలా? అని ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబు చేసిన నీచమైన పని అని, అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అదే చేశాడని ఆరోపించారు.

ఎమ్మెల్యేలందరినీ కొనుగోలు చేసినా సరే.. ఒక్కడైనా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఇక తన పోటీ గురించి చెబుతూ.. రాబోయే ఎన్నికల్లో ఎక్కడినుంచి బరిలో ఉంటానో ఫిబ్రవరిలో స్పష్టత ఇస్తానని చెప్పారు.

మామాట: పవన్ జగన్‌పై మెత్తని కత్తులు దూస్తున్నట్లున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: