పవన్ మళ్ళీ సినిమాలు చేయనున్నారా?

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 18,

ఏపీ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపుగా కనబడటమే మానేశారు. కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు. కానీ అమరావతిలోని ఒక దేవాలయానికి అక్షరాలా కోటిన్నర రూపాయల విరాళం ఇచ్చారు. ఆ తరువాత కూడా కనబడటమే మానేశారు. కానీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అమరావతి ని వదిలేసి హైదరాబాద్ కి మకాం మార్చాడని సమాచారం.

ఇకపోతే పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రలహరి సినిమా చూసిన పవన్, ఆ చిత్రానికి ప్రశంసలు కురిపించాడు. తాజాగా ఈ విషయాన్నీ మైత్రీమూవీ మేకర్స్‌, సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. పవన్‌, పంపిన బొకే ఫొటోని ట్వీట్‌ చేసింది మైత్రీ మూవీమేకర్స్‌. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గతంలో పవన్ తో సినిమా చేయాల్సి ఉంది కానీ పవన్ రాజకీయాల్లో బిజీ అవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ సినిమా విషయంలో అడ్వాన్ డబ్బుపై కాస్త రచ్చ జరిగిన విషయం కూడా తెలిసిందే.

తాజాగా పవన్ మళ్ళీ సినిమాల్లోకి రానున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా నిర్మాత రామ్‌ తాళ్ళూరి ఇప్పటికే పవన్‌తో సంప్రదింపులు జరిపి, ఓ సినిమా కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నారంటూ సమాచారం. అంతేకాకుండా మైత్రీ మూవీమేకర్స్‌ తో ఒక సినిమా చేయనున్నారని, అంతేకాకుండా వేరే సంస్థలతో కూడా సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే  పవన్ ఇక వరుస సినిమాలతో బిజీ కానున్నారని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

మామాట: తెలిసినపని చేసుకోవడం క్షేమం కదా

Leave a Reply