కర్నూలుకు పవన్..సుగాలి ప్రీతి కోసం ర్యాలీ..

Share Icons:

కర్నూలు: 2017లో సుగాలి ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. కర్నూలు లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె ఆమె. దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని. ఈ రెసిడెన్షియల్ పాఠశాాల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడిదనే ఆరోపణలు ఉన్నాయి. 2017 ఆగస్టు 19వ తేదీన సుగాలి ప్రీతి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు.

తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని చెబుతున్నారు. అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఇదివరకే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ సుగాలి ప్రీతి కుటుంబీకులు డిమాండ్ చేసినప్పటికీ.. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం స్పందించలేదు. పాఠశాల తమ పార్టీకి చెందిన నాయకుడిదే కావడం వల్ల చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తునకు అంగీకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో మరోసారి అదే డిమాండ్ లేవనెత్తుతున్నారు సుగాలి ప్రీతి కుటుంబీకులు. ఆ కుటుంబానికి పవన్ కల్యాణ్ అండగా నిల్చున్నారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆయన భారీ ర్యాలీని నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులు సన్నాహాలను పూర్తి చేశారు. ఈ ర్యాలీకి ఒక్క రోజు ముందే- జిల్లా ఎస్పీ ఫకీరప్ప ప్రకటన చేయడం గమనార్హం.

మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచీ కోట్ల కూడలి వరకూ పవన్ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులు, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. తర్వాత కోట్ల కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు పవన్. ఈ సభఊలో కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేయబోతున్నారు

గురువారం పవన్ కళ్యాణ్ కర్నూలు టూర్ షెడ్యూల్ : 13వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కర్నూలు, ఎమ్మిగనూరులో నిర్వహించే కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతారు. కర్నూలులో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో జోహరాపురం ప్రాంతంలో మాట్లాడతారు. ఆ తర్వాత జి+ 2 గృహాలు నిర్మించిన ప్రాంతానికి వెళ్తారు. గృహాల కేటాయింపు పొందిన లబ్ధిదారులతో సమావేశమవుతారు. తర్వాత ఎమ్మిగనూరు వెళ్తారు. అక్కడ వీవర్స్ కాలనీని సందర్శిస్తారు. చేనేత కార్మికుల సమస్యల్ని అడిగి తెలుసుకుంటారు.

Leave a Reply