డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి రాలేదు…జనసేనని విలీనం చేయను…

pawan kalyan sensational comments
Share Icons:

అమరావతి:

 

ఎన్నికలు ముగిసిన రెండు నెలల తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్…..పార్టీ నేతలతో పార్లమెంట్ నియోజకవర్గాలు వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ…ఎన్నికల్లో ఓటమికి గల కారణాలని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో ఎవరితో కలిసి వెళ్లినా సరే లౌకిక వాదాన్ని మాత్రం వీడనని అంతేకాకుండా తాను జనసేన పార్టీను ఏ పార్టీలోనూ విలీనం చెయ్యబోను అని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు.

 

ఈ మాటలు బట్టి చూస్తుంటే పవన్ భవిష్యత్ లో ఏదొక పార్టీతో పొట్టుతో ముందుకెళ్లి అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే పదవుల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని, జాతీయస్థాయి నాయకులతో ఉన్న పరిచయాలు, స్టార్ డమ్ ఉపయోగించుకుంటే సరిపోతుందని పవన్ అన్నారు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి రాలేదని, భావితరాల భవిష్యత్తు కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానని, మానవత్వం చచ్చిపోకూడదని మాత్రమే నా వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.

 

 

ఇకపోతే రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సర్వసాధారణమని, గెలుపు వచ్చిన తరువాత ఎవరు మనవాళ్లో, ఎవరు పరాయివాళ్లో తెలియదు కానీ, ఓటమిలో మాత్రం మనవాళ్లు ఎవరో కచ్చితంగా తెలుస్తుంద”న్నారు. ప్రజలకోసం, ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, ఇలాంటి 100 ఓటములు కూడా నన్ను కృంగదీయలేవని పవన్ కళ్యాణ్ అన్నారు.

 

అసలు తాను మళ్ళీ మళ్ళీ ఓడిపోవటానికైనా సిద్ధమే కానీ, నమ్ముకున్న విలువలను మాత్రం చంపుకోడానికి సిద్ధంగా లేనని జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

 

One Comment on “డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి రాలేదు…జనసేనని విలీనం చేయను…”

Leave a Reply