వైసీపీ మాతో పొత్తుకోసం మధ్యవర్తులతో మాట్లాడిస్తుంది…..

Share Icons:

విజయవాడ, 12 జనవరి:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం కృష్ణా జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన పవన్ మాట్లాడుతూ… జనసేనకు సీట్లు రావని చెబుతున్న నేతలు ఇప్పుడు తమతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని వైసీపీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇక ఇందుకోసం కొందరు మధ్యవర్తులతో మాట్లాడిస్తున్నారని తెలిపారు.

జనసేన ఏపీ అంతటా బలంగా ఉందని, జనసేన మాతో కలిసి రావాలని చంద్రబాబు చెప్పినా, తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ మీరు కలిసి పనిచేయాలని చెప్పినా.. అది మన బలాన్ని సూచిస్తున్నాయని కార్యకర్తలతో అన్నారు.

అయితే ఓట్ల శాతం ఎంత అనే విషయాన్ని పక్కనపెడితే.. మనకు బలం ఉందని తెలుసు కాబట్టే పొత్తు కోసం వాళ్లంతా ముందుకు వస్తున్నారని అన్నారు.

మామాట: ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి…

Leave a Reply