అమరావతి నుంచే పవన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం..

Share Icons:

అమరావతి, 1 జనవరి:

2019 ఎన్నికలకు అమరావతి నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి నూతన రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈరోజు అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పవన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై తాను అమరావతిలోనే ఉంటానని కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు.

అయితే ఏపీలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించాలి అంటే కార్యకర్తలు కష్టపడి పనిచెయ్యాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బంగారు భవిష్యత్ ఒక్క జనసేన మాత్రమే ఇస్తుందని ఆ విషయాన్ని జనసైనికులు ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలని కోరారు.  

మామాట: మళ్ళీ చాలరోజుల తర్వాత జనాల మధ్యకి వచ్చినట్లున్నారు…

Leave a Reply