Header Banner
Header Banner
TRENDING NOW

పవన్ నిజాయితీ పై అనుమానాలు

పవన్ నిజాయితీ పై అనుమానాలు

గుంటూరు, డిసెంబర్ 01,

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో   తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల తర్వాత ఏపీ ఎన్నికలపైనే దృష్టి సారించాలని పలువురు ప్రధాన పార్టీ నేతలు  భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో తొలి వికెట్ పడింది  మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌ బాబు జనసేన అధినేత పవన్ కులుసుకున్నారు. కాగా,  తన మంత్రి పదవిని పోగొట్టుకున్న తరువాత ఆయన వ్యవహరిస్తున్న తీరు తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో అధిష్ఠానం కూడా ఆయనపై సీరియస్‌గా ఉంది. దీంతో రావెల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు అయితే, ఆ పార్టీ నాయకులు రావెల చేరికకు అడ్డుపడ్డారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రత్యమ్నాయం జనసేన వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది.

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

వాస్తవానికి రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్నవారికి కూడా దక్కనంత స్థాయి రావెలకు చంద్రబాబు కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటకు వచ్చీ రాక ముందే ఎమ్మెల్యే సీటు స్వాగతం పలికింది. నియోజక వర్గం అంతటా ప్రచారం నిర్వహించ కపోయినా పార్టీని చూసి ఆయనకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు. అంతేకాదు ఏకంగా కీలక శాఖలతో కూడిన కేబినెట్‌ పదవి కూడా రావెలకు చంద్రబాబు కట్టబెట్టారు. అయితే అందివచ్చిన అదృష్టాన్ని కూడా అంతే స్పీడుగా ఆయన చేజార్చుకున్నారు. ఊహించని స్థాయిని కల్పించిన అధినేత చంద్రబాబు వద్ద పట్టు సాధించలేకపోవటం, అడగకుండానే ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకు దగ్గరకాలేకపోవటం మూలంగా మంత్రి పద విని పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

దీంతో ఆయన పార్టీ మారుతారని టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. వివాదాస్పద వ్యక్తిగా పేరున్న రావెల కిషోర్‌బాబును జనసేనలోకి చేర్చుకునేందుకు పవన్‌ ఎలా ఓకేచేశారని జనసేన శ్రేణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడు ఇతని పై పోరాడామని, ఇప్పుడుం మన పార్టీలో చేరిపోగానే, పునీతుడు అయిపోతాడా అని జనసైనిక్స్ అంటున్నారు. రాజధాని భూ అక్రమాలల్లో రావెల పాత్రతో పాటు, ఆయన కుమారులపైనా పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్‌లో రావెల కుమారుడు ఒక ముస్లిం మహిళను రోడ్డుపైనే చేయి పట్టుకుని కారులోకి లాగబోయాడు. ఆ సమయంలో స్థానికులు అతడిని చితక్కొట్టారు.

కానీ తర్వాత కేసు రాజీ చేసుకున్నారు. మరో సందర్భంలో రావెల కిషోర్‌బాబు కుమారుడు మద్యం సేవించి అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. రావెల కిషోర్‌బాబు పైనా ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. రావెల కిషోర్‌బాబు తనను వేధిస్తున్నాడంటూ గుంటూరు చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌ అప్పట్లో బోరున విలపించారు. ఈ వ్యవహారశైలి వల్లే రావెల మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నారు. అయితే వైసీపీలోకి వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యగా, అక్కడ తలుపులు వేసేయ్యటంతో, పవన్ చేర్చుకోవటానికి రెడీ అయ్యారు.

మామాట: మన పార్టీలో చేరితే పునీతులౌతారు కదా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: