జనసేనకు  88 సీట్లు  .. జేడీ  లక్ష్మీనారాయణ!

Share Icons:

విశాఖ, ఏప్రిల్ 18,

ఏపీలో ఈ నెల 11 న ఎన్నికలు ముగిశాయి. అయితే ఇప్పుడు అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే. ఎన్నికల ఫలితాలకు ఇంకా నెల రోజుల పైనే సమయం ఉండడంతో పార్టీల, నాయకుల అంచనాలు ఒక్కొక్కరివి ఒక్కోరకంగా ఉంటున్నాయి. అయితే అధికార పార్టీ అధినేత చంద్రబాబు 130 సీట్లకు పైగా టీడీపీ గెలుస్తుందని చెబుతుంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ మాత్రం 130 సీట్లు గెలవబోతున్నామని ఈ సారి తప్పకుండా అధికారం తమదేనని ధీమాను వ్యక్థం చేస్తున్నారు.

అయితే ఎన్నికలకు ముందు జనసేన అధినేత గెలుపు తమదేనని ప్రచారంలో చెబుతూ వచ్చినా ఎన్నికల తర్వాత మాత్రం అసలు గెలుపోటములపై నోరు మెదపడంలేదు.   ఇదిలా ఉండగా జనసేన తరపునుంచి విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్ధిగా పోటీ చేసిన జేడి లక్ష్మీనారాయణ విశాఖలో గెలుపు మాత్రం పక్కాగా తమదేనని, అంతేకాదు జనసేన మొత్తం మీద 88 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాబోతుందని ప్రగల్భాలు పలికారు.

అయితే జనసేన వర్గాలలో చెప్పుకుంటున్నదేమిటంటే అసలు జనసేన తరపున పోటీ చేసిన వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారని, ఎందుకంటే గాజువాక, భీమవరంలో పోటీ చేసిన పవన్ గెలుపే అయోమయంలో ఉందని అంటున్నారు. ఐతే కొందరు భీమవరంలో పవన్ ఓడిపోతారని, మరొకొందరు రెండు చోట్లా పవన్ ఓటమి పాలవుతారని అంటున్నారు. పార్టీ అభ్యర్థి పవనే గెలవలేనపుడు ఇక పార్టీ అభ్యర్ధులు 88 చోట్ల ఎలా గెలవగలరు? 88 సీట్లతో జనసేన అధికారంలోకి రావటమే నిజమైతే మరి పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.

విశాఖపట్నం పార్లమెంటు టీడీపీ అభ్యర్ధిగా నిలబడ్డ భరత్ ను ఓడించేందుకే టీడీపీ వాళ్ళు జనేసేనకు క్రాస్ ఓటింగ్ చేశారనే స్వయంగా పార్టీ అధినేతనే దీనిని ముందుండి నడిపించారని, అందుకే క్రాస్ ఓటింగ్ లో ఓట్లు పడటమే నిజమైతే జేడి మొదటి లేదా రెండో స్థానంలో ఉండవచ్చేమో కానీ, ఆయన చెప్పినట్టు జనసేన 88 సీట్లు గెలవడం మాత్రం ఒక భ్రమ అని అర్ధమవుతుంది. అయితే ఎవరెన్ని చెప్పినా మే 23 వరకు వేచి చూడాల్సిందే.

మామాట: వారి దర్యాప్తులో అలా వచ్చిందేమో.. మరి.

Leave a Reply