నేను కులాన్ని నమ్ముకున్న వ్యక్తిని కాదు…

pawan kalyan fires on tdp and ysrcp
Share Icons:

నరసాపురం, 11 ఆగష్టు:

తాను కులాన్ని నమ్ముకున్న వ్యక్తిని కాదని, కులాల మద్య చిచ్చు పెట్టి విడదీయడమే సీఎం చంద్రబాబు నాయుడు విధానంగా పెట్టుకున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. పోరాట యాత్రలో భాగంగా నిన్న సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… తనపై చంద్రబాబు కులం ముద్రవేయాలని చూస్తున్నారని, జనసేన ఎప్పుడూ ఇలాంటి విభజన రాజకీయాలు చేయబోదన్నారు.

2019లో జనసేన పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందని పవన్ ధీమా వ్యక్తంచేశారు. ఇక అభివృద్దికంటే ఏపీలో అవినీతి ఎక్కువగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంలో మాట తప్పిన బీజేపీ ఇక్కడి ప్రజల నమ్మకం, వారి మనసులో స్థానం కోల్పోయిందని అన్నారు. ఇక ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చినప్పుడు తాను పాచిపోయిన లడ్లు అని అంటే, టీడీపీ వారు తనను అనుభవం లేని వ్యక్తి అని విమర్శించారని ఆయన గుర్తుచేశారు.

ఇప్పుడు టీడీపీ నేతలు ఎందుకు మాట మార్చారని ఆయన ప్రశ్నించారు. అలాగే జగన్‌లా తన వద్ద కోట్ల ఆస్తులు లేవని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనకు స్నేహితుడు కాదని,  బంధువు కాదని పవన్ అన్నారు.

మామాట: కానీ ఒకే కులంకి చెందిన వారే మీ పార్టీలో ఎక్కువ ఉన్నట్టున్నారుగా……

Leave a Reply