పవన్ ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు మృతి….

Pawan Kalyan Fans died with current sho
Share Icons:

విశాఖపట్నం, 6 జూన్:

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాట యాత్ర పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆయన నేడు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో పర్యటించనున్నారు.

అయితే ఆయన పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలి ఇద్దరు యువకులు మృతిచెందారు.

వివరాల్లోకి వెళితే… తమ అభిమాన హీరో రాకను పురష్కరించుకుని తోళెం నాగరాజు(తుని), శివ(పాయకరావుపేట) అనే ఇద్దరు పవన్ కళ్యాణ అభిమానులు పాయకరావుపేట సాయిమహల్ జంక్షన్ దగ్గర స్వాగత ఫ్లెక్సీలు కట్టేందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే ఆ ఫ్లెక్సీలు సుమారు 30 అడుగులు ఉంటాయి. ఇక వీటిని రహదారి పక్కన కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలడంతో వారు షాక్‌కు గురై అక్కడిక్కడే మృతిచెందారు. వీరి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

కాగా… తమ అభిమానాన్ని చాటుకునేందుకు బ్యానర్లు కడుతుండగా వీరు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందడంతో పాయకరావుపేటలో తీవ్ర విషాదం నెలకొంది.

మామాట: ప్రాణం తీసిన అభిమానం…

Leave a Reply