గాజువాకలో పవన్‌కి ఇంతే ఖర్చు అయిందా?

Share Icons:

విశాఖపట్నం, 15 మే:

ఏప్రిల్ 11న జరిగిన ఏపీ ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారని అందరికీ తెలుసు. కానీ ఎన్నికల సంఘం లెక్క ప్రకారం…. అభ్యర్థులు చూపుతున్న ఖర్చు మాత్రం అందరూ ముక్కున వేలేసుకునేలా ఉంది. నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు రూ. 28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రూ. 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది.

కానీ, మన అభ్యర్థులు అందులో సగం కూడా ఖర్చు చేయలేకపోయారు. వీరు సమర్పించిన లెక్కలు చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. అందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 8,39,790 ఖర్చు చేసినట్టు చూపించారు. గంటా శ్రీనివాసరావు (టీడీపీ) రూ. 23,19,325 ఖర్చు చేశారు. సబ్బం హరి (టీడీపీ) రూ. 11,18,617 ఖర్చుగా చూపించారు. గుడివాడ అమర్ (వైసీపీ) రూ. 12,60,554 ఖర్చు చేశారు. విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు కేవలం రూ. 2,43,711 మాత్రమే ఖర్చు చేసినట్టు చూపించారు.

మామాట: మొత్తానికి చాలా తక్కువ ఖర్చు పెట్టారే…

Leave a Reply