పవనా…ఇది తగునా…

pawan kalyan confusion politics
Share Icons:

విజయవాడ, 27 అక్టోబర్:

ఉట్టికెగ‌ర‌లేన‌మ్మ‌.. స్వ‌ర్గానికి ఎగురుతాన‌ని ట‌ముకేసింద‌ట‌! ఇప్పుడు ఇలానే ఉంది జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయం. ఏపీలో రాజ‌కీయాలు చేసేసిన ఆయ‌న త‌గుదున‌మ్మా అంటూ.. తెలంగాణాలోనూ కాలెట్టాడు. అక్క‌డ ఏకంగా రెండు మూడు రోజులు యాత్ర చేసి.. కేసీఆర్ ప్ర‌భుత్వానికి ధ్రువ‌ప‌త్రాలు, ఎన్‌వోసీలు ఇచ్చి.. మ‌ళ్లీ సైలెంట్ అయిపోయాడు.

అయితే, ఇప్పుడు తెలంగాణాలో ముంద‌స్తు ముచ్చ‌ట‌కు తెర‌దీసింది. డిసెంబ‌రు 7న ఎన్నిక‌లు జ‌రిగేందుకు కూడా ముహూర్తం ఖ‌రారైంది. దీనిని అన్ని రాజ‌కీయ ప‌క్షాలూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. అయితే, తెలంగాణాలోనూ త‌న స‌త్తాను చాటుతాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్.. ఇప్పుడు మాత్రం ఎన్నిక‌ల వేడిరాజుకునే స‌రికి అస‌లు పోటీ చేయాలా? వ‌ద్దా? అనే మీమాంస‌లో కూరుకుపోయారు.

వాస్త‌వానికి జనసేన పుట్టింది హైదరాబాద్ గడ్డపైనే. కానీ తెలంగాణలో పోటీపై ఎటూతేల్చుకోలేని జనసేనాని అకస్మాత్తుగా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో రాజకీయాలపై దృష్టి ప‌డింద‌నే వాద‌న వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లక్నో పర్యటన వెనక ‘భారీ రాజకీయ ఎత్తుగడ’ ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అక్క‌డి మాయావ‌తి నేతృత్వంలోని బీఎస్పీకి వెనకబడిన వర్గాల పార్టీగా పేరుంది.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న పవన్ కళ్యాణ్ ‘సోషల్ ఇంజనీరింగ్’లో భాగంగానే ఈ పర్యటన తలపెట్టారన్నది ఆ వర్గాల సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గంతోపాటు..శక్తివంతమైన ఎస్సీలను కలుపుకోవటం. ఇలా చేయటం ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు దక్కించుకోవటం అనేది పవన్ ప్లాన్‌. సహజంగా ఎవరైనా పార్టీ పెట్టిన వెంటనే పోటీచేస్తారు. కానీ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది మాత్రం అందుకు బిన్నమైన శైలి.

ఆయన పార్టీ పెట్టి ఆ తర్వాత టీడీపీ, బీజేపీలకు మద్దతుగా నిలిచారు. తర్వాత తప్పు చేశాను. టీడీపీకి మద్దతు ఇవ్వటం తప్పు అని తెలిసింది అంటూ ఇప్పుడు ఏపీలో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక‌, తెలంగాణలోనూ పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా కాకపోయినా..సినిమాల పరంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వస్తాయని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఆ ప్రచారం నిజం అయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు బరిలోకి దూకారు. మ‌రి ఇక్క‌డ ప‌వ‌న్ ప్ర‌చారం చేయ‌కుండా, క‌నీసం.. ఇక్క‌డ రెండు స్థానాల్లోనూ పోటీ చేయ‌లేక పోతున్నారు. మ‌రి ఇప్పుడు ల‌క్నో ప‌ర్య‌ట‌న అంటూ.. ఆయ‌న చేస్తున్న రాజ‌కీయం ఎటు వెళ్తుందో చూడాలి. ఏదేమైనా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక‌దానిలోనైనా స‌త్తా చాటుకోలేని ప‌వ‌న్‌.. ఇప్పుడు ఇలా ఎక్క‌డో ఉన్న ల‌క్నోలో రాజ‌కీయాలు అంటే.. ఎబ్బెట్టుగానే ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మామాట: ముందు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం  చేసుకుంటే మంచిదేమో…..

Leave a Reply