ఎన్టీఆర్‌ని కామెంట్ చేసిన పవన్…

Share Icons:

విజయవాడ, 11 జనవరి:

ఏపీ మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ని ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన కామెంట్ సంచలనం రేపుతోంది. జనసేన పార్టీ ట్విట్టర్ ఖాతా వేదికగా గతంలో ఎన్టీఆర్ తెలంగాణలో పోటీ చేసి ఓడిపోయిన ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ఎన్టీఆర్‌గారు మెదక్‌లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను’’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఇంకా ఎలాంటి కామెంట్లు చేయలేదు.

మామాట: మరి టీడీపీ నేతలు దీన్ని ఎలా తీసుకుంటారో.

Leave a Reply