కర్నూలులో హైకోర్టుకు ఓకే…కానీ..

Share Icons:

కర్నూలు: వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కర్నూలులో హైకోర్టుని వ్యతిరేకిస్తున్నారనే ఉద్దేశంతో రాయలసీమ జే‌ఏ‌సి నేతలు పవన్ పై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు పర్యటనకు వెళ్ళిన పవన్…తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చెయ్యటంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు. ఇక కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుపై అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే కర్నూలులో హైకోర్టు తాను వ్యతిరేకం కాదని పేర్కొన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కేవలం హైకోర్టుతోనే అభివృద్ధి జరగదని గట్టిగా చెప్పారు.  పెట్టుబడులు వస్తేనే కర్నూలు అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక నేతలు వాటా అడగడం వల్ల రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు.

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చెయ్యటం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా ? అని ఆయన ప్రశ్నించారు . కర్నూలులో పరిశ్రమలు న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే వస్తాయా ? అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ అందుకే రాయలసీమ అభివృద్ధి చెందడం లేదన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతి సాధిస్తేనే రాయలసీమ అభివృద్ధి చెందుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. చదువుకున్న యువకులు తమకు ఉపాధి లేదనే ఆవేదన చెందుతున్నారన్నారు పవన్‌ కళ్యాణ్‌. అయితే కియా పరిశ్రమ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకచోట పరిశ్రమ ఏర్పడినప్పుడు అభివృద్ధి చెందాలి అన్న పవన్ కళ్యాణ్ పరిశ్రమల విషయంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అయితే రాయలసీమ లో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి భయపడతారని అందుకు కారణం స్థానిక నేతలు వాటా అడుగుతారేమో అని భయం అని పేర్కొన్నారు. ఏది ఏమైనా పవన్ మూడు రాజధానులకు వ్యతిరేకం అని కర్నూలు వాసులు ఆగ్రహంతో ఉన్న సమయంలో కర్నూలు హైకోర్టు ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని చెప్పి పవన్ క్లారిటీ ఇవ్వటం మంచిదైంది.

 

Leave a Reply