పిల్లల చదువుల్లో ఫ్యాక్షన్ సంస్కృతి: సీమలో పవన్ న్యూ స్కెచ్

janasena president pawan kalyan comments on jagan and ysrcp
Share Icons:

అమరావతి: జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు ఆపడం లేదు. తెలుగు భాష విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గనని పవన్ చెబుతున్నారు. ఈ మేరకు జగన్ పై పవన్ విమర్శలు చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. జగన్ రెడ్డి గారు 21-11న కొమ్మనాపల్లి సభలో తెలుగు భాష నిర్మూలనను సమర్థించుకొంటూ మాట్లాడినది: ‘ఎంతమంది శత్రువులనైనా ఎదిరిస్తా. ఎంతమంది శత్రువులు కలిసి వచ్చినా నేను తట్టుకుంటా. మీరు వాళ్లని నిలదీయండి. ఇంగ్లీష్‌పై తప్పుగా మాట్లాడేవారిని నిలదీయండి” అని జగన్ చేసిన వ్యాఖ్యలను పవన్ ప్రస్తావించారు

దీనికి జనసేన సమాధానం అంటూ ‘దయచేసి పిల్లల చదువుల్లోకి ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకురాకండి. తెలుగు భాష, ఇంగ్లీష్ భాష అనే భేదం తీసుకొచ్చి రెండు వర్గాలుగా చేయొద్దు. మాతృ భాష నేర్పమంటే దుర్భాషలాడతారా?’ అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. ‘ఇంగ్లీష్ వద్దనడం లేదు.. మాతృ భాష వదలొద్దు అంటున్నాం. ఫ్యాక్షన్ గొడవల్లో ప్రత్యర్థిని చంపేసినట్లు-భాషను నిర్మూలించడానికి, భాష ఏమీ రాత్రికి రాత్రి పుట్టింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వారసత్వంగా భాషా సంపద వస్తోంది. చిరస్థాయిగా ఉంటుంది’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

‘తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, భారత దేశ సనాతన ధర్మాన్నీ, మీరు ఇంగ్లీష్ మాధ్యమం ముసుగులో చంపేద్దామని చేస్తున్న ప్రయత్నం అర్థం కాని వాళ్లు ఎవరూ లేరు. తెలుగు భాష, సంస్కృతిపై మీరు చేస్తున్న దాడిని ప్రజలు బలంగా ఎదుర్కొంటారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి.. జాతి గుండె చప్పుడు. మీలాంటివాళ్ల నుంచి భాషా సంస్కృతులను ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తానని, పర్యటనకు సంబంధించిన కార్యక్రమాన్ని పార్టీ ప్రతినిధులు రూపకల్పన చేస్తున్నారని పవన్ అన్నారు. రాయలసీమలో జనసేనకు అపారమైన క్యాడర్ ఉందని, క్యాడర్‌ను సమష్టిగా ఉంచి వారిని ముందుకు నడిపే నాయకత్వాన్ని సిద్ధం చేద్దామని, నిలకడగా పనిచేసేవారిని రాయలసీమలో గుర్తించాలని,  కార్యకర్తలను రక్షించుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఉందని, వారికి అండగా నిలుద్దామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

 

Leave a Reply