టీడీపీ, వైసీపీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు…

Pawan kalyan comments on 2019 elections
Share Icons:

జంగారెడ్డిగూడెం, 2 అక్టోబర్:

ఏపీ రాజకీయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కానీ, వైసీపీ కానీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తమ పార్టీ పూర్తి మెజార్టీ సాధించి.. ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా? లేక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? అనేది కాలమే నిర్ణయిస్తుందని అన్నారు.

ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రాజారాణి కల్యాణ మంటపంలో డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీలు జరుగుతాయా? సాధ్యమేనా? అని చంద్రబాబును అడిగితే, ‘ఖచ్చితంగా సాధ్యమే..నన్ను నమ్మండి’ అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడేమో, రుణమాఫీ చేయకపోగా పాత రుణాలు కూడా కట్టుమంటున్నారని, ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉందని పవన్ విమర్శించారు.

ఇక డ్వాక్రా పథకం టీడీపీది కాదని, ఇది అంతర్జాతీయ పథకమని, ఆ పథకాన్నే టీడీపీ అమలు చేస్తోందని అన్నారు. మీ హక్కుల కోసం ప్రభుత్వాన్ని బలంగా నిలదీయండి.. సమస్య పరిష్కరిస్తారా? లేదా? అని ప్రశ్నించండి అని పవన్ డ్వాక్రా మహిళలకు సూచించారు.

మామాట: కర్ణాటకలో మాదిరిగా ఏపీలో 2019 ఎన్నికల ఫలితాలు ఉంటాయంటరా

Leave a Reply