అమరావతిలో ఉద్రిక్తత: సచివాలయంలో జగన్…పవన్‌ని అడ్డుకున్న పోలీసులు…

pawan kalyan amaravati tour...polices stops pawan
Share Icons:

అమరావతి: రాజధాని తరలింపుపై అమరావతి రైతులు గత రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వారికి మద్ధతు ఇచ్చేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు అమరావతిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మందడం గ్రామంలో దీక్ష చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించేందుకు పవన్ కళ్యాన్ అక్కడకు చేరుకొనేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుచెప్పారు. మందడం గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని..సచివాలయం నుండి ముఖ్యమంత్రి తిరిగి వెళ్లేవరకు వెళ్లనీయమని పోలీసులు స్పష్టం చేసారు. నేరుగా తుళ్లూరు వెళ్లాలని పోలీసులు స్పష్టం చేసారు. దీంతో..కాన్వాయ్ వదిలేసి కాలి నడకన కిష్టాయపాలెం నుండి వెంకటపాలెం చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు ఏర్పాటు చేసారు. మందడం గ్రామస్థులు..రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

పవన్ కు మద్దతుగా ఆయనతో పాటుగా స్థానిక గ్రామాల ప్రజలు..రైతులు కాలి నడకన మందడం చేరుకుంటున్నారు. అయితే, కాసేపట్లో ముఖ్యమంత్రి తిరిగి వెళ్లిపోతారని..ఆ వెంటనే గ్రామం లోకి అనుమతి స్తామని పోలీసులు నచ్చ చెప్పారు. అక్కడ పెద్ద సంఖ్యలో స్థానికులు…పవన్ అభిమానులు చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదానలు చేస్తున్నారు.

అంతకముందు పవన్ కృష్ణాయపాలెంలో దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు పవన్‌కు తమ సమస్యలను వివరించారు. పొలం పనులు లేవని, కూలి పనులు రావడంలేదని చెప్పారు. భూములు ఇచ్చి.. బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నామన్నారు. చీరెలు, నగలు కట్టి ధర్నాలకు వస్తున్నామని వైసీపీ నేతలు అవమానంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏం ఖర్మ పట్టిందని ఏడుస్తున్నామన్నారు. ప్రతి పక్ష నేతగా ఆనాడే జగన్ అమరావతిని ఎందుకు వ్యతిరేకించలేదని మహిళా రైతులు ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అంటే ఇదేనా అని నిలదీశారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సుస్థిరమైన పాలన అందించలేక పోతున్నారని, ఈరోజుకు రాజధాని ఎక్కడ అనేది జగన్ రెడ్డికి స్పష్టత లేదని విమర్శించారు. తమ కన్నీరు సిఎంకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

 

Leave a Reply