నాకు ఎవరూ గుండు కొట్టించలేదు…..పరిటాల రవి ఎవరో నాకు తెలీదు..!!

Share Icons:
విజయవాడ, 8డిసెంబర్:

గతంలో తనకు పరిటాల రవి గుండు చేయించారన్న ప్రచారంపై ప్రముఖ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

సమాజం ముందుకెళ్లాలన్నా, అంబేడ్కర్‌ కలలు సాకారం కావాలన్నా కులాలకు అతీతంగా ప్రజలంతా మెలగాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

శుక్రవారం ఆయన  విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ పరిటాల రవి నాకు గుండు కొట్టించాడు అనేది ప్రచారం మాత్రమే. అది పచ్చి అబద్ధం.

ఆ ప్రచారం చేయించింది కూడా టీడీపీ వాళ్లే. టీడీపీ వాళ్లు అప్పుడు నాకు చాలా ద్రోహం చేశారు. అయినా అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు.

అన్ని చేసిన టీడీపీకి గత ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చానంటే రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే తెదేపాకు మద్దతిచ్చా.

రాష్ట్ర విభజన తర్వాత కోపతాపాలకు పోతే అభివృద్ధి జరగదు. కులాలు, మతాలను దాటితేనే ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మంచగలం.

తెదేపాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. కానీ కష్టసమయంలో ఉన్న రాష్ట్రానికి దక్షత కలిగిన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే ఆనాడు మద్దతిచ్చా.

నేను ‘తమ్ముడు’ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు మా అన్నయ్య నాగబాబు ఫోన్‌ చేసి ఎక్కడున్నావ్‌ అని అడిగారు. బీహెచ్‌ఈఎల్‌లో షూటింగ్‌లో ఉన్నానని చెప్పా. పరిటాల రవి నీకు గుండు గీయించి కొట్టారంట అని అన్నాడు. అసలు పరిటాల రవి ఎవరు? అని అడిగాను.

తెదేపా కార్యాలయం నుంచి ఫోన్‌ చేసి చెప్పారని నాగబాబు చెప్పాడు. ఆలోచించాను. ఒక అభాండం. ఆ ప్రచారం మూడేళ్ల పాటు పెరిగి పేపర్‌లో వార్తలు రాసే స్థాయికి చేరుకుంది. నాకు ఎవరూ గుండు గీయంచలేదు.

షూటింగ్‌లో చిరాకుగా ఉంటే నేనే గుండు గీయించుకున్నా. నాకు గుండు గీయిస్తే వూరుకునే వ్యక్తినా. కానీ, ఈ దుష్ప్రచారం చేసిన వారిని నేను మనసులో పెట్టుకోలేదు. వారు నాముందే తిరుగుతున్నారు.

నన్ను ఎన్ని రకాలుగా అవమానించినా నేను తెదేపాకు మద్దతిచ్చా. ‘

సుదీర్ఘ కాలం తర్వాత పవన్ స్వయంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం పలువురిని విస్మయపరుస్తోంది.

మామాట: అనంతపురంలో ఇవ్వని వివరణ ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో…..

 

Leave a Reply