Pawan Kalyan: పవన్ సినిమాలు ఫ్లాపైనా డబ్బులొచ్చేస్తాయ్: దర్శకుడు గీతాకృష్ణ వ్యాఖ్యలు

Share Icons:
పెట్టిన డబ్బులు కలెక్షన్ల రూపంలో వెనక్కి రాకపోతే ఎంత గొప్ప సినిమా అయినా ఫ్లాప్ అయినట్లేనని అంటున్నారు ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ. డబ్బులు వస్తేనే సినిమా హిట్ లేకపోతే ఫ్లాప్ అని అంటున్నారు. కానీ కొందరు మాత్రం డబ్బులు వచ్చినా సినిమా బాలేదు అని నాన్‌సెన్స్ మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేసారు.

‘‘మంచి బ్రాండ్ స్టార్‌డం ఉన్న హీరో సినిమా చేస్తే మూడు రోజుల్లో కలెక్షన్లు వచ్చేస్తాయి. కొన్ని సినిమాలు ప్రమోషన్స్ వల్ల సపోర్ట్ చేసే సెలబ్రిటీల వల్ల హిట్ అవుతుంటాయి. అందుకు కారణం పెళ్లిచూపులు. అప్పట్లో విజయ్ దేవరకొండ అంటే ఎవరికీ తెలీదు. కానీ సురేష్ బాబు సపోర్ట్ చేసారు కాబట్టి అది హిట్ అయింది. ఇంకో విషయం ఏంటంటే.. మనం పెట్టిన డబ్బులు కలెక్షన్ల రూపంలో వెనక్కి వస్తే సినిమా హిట్ అయినట్లే. కానీ కొందరు మేథావులు ఏం చెప్తారంటే.. కలెక్షన్స్ వచ్చినా సినిమా ఫ్లాప్ అంటున్నారు. సినిమా బాగుందో లేదో ఒక్క రోజులో చెప్పేస్తున్నారు. సినిమా బాగోలేకపోతే మరి మిగతా రోజుల్లో జనాలు వెళ్లి ఎందుకు చూస్తారు’’

READ ALSO:

‘‘ చెప్పాలంటే గతంలో నటించిన తొమ్మిది సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అన్నారు. అదేంలేదు. ఆయన సినిమా బార్డర్ దాటేసాయి. అంటే.. పవన్‌కి బ్రాండ్ ఉంది కాబట్టి ఆయన నటించే ఫ్లాప్ సినిమా కూడా డబ్బులు రాబడుతుంది. దేశంలో అలాంటి స్టార్‌డం సంపాదించుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. కానీ ఆయన నటించిన ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ అయింది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆ క్రేజ్ పోతోంది. సినిమా హిట్ అవ్వాలంటే కచ్చితంగా బ్రాండింగ్ ఉండాలి. అందుకు నేను ఓ చిన్న ఉదహరణ చెబుతా. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో నటించిన ఇద్దరూ కొత్తవాళ్లే. కానీ నిర్మాత రామ్మోహన్ నాగార్జున గారిని కలిసి ఆయనకు సినిమా చూపించారు. నాగార్జునకు నచ్చి ఆయన ప్రెజెంట్ చేయడానికి ఒప్పుకున్నారు’’

‘‘అలా సినిమాకు నాగ్ వల్ల పాపులారిటీ పెరిగి మంచి హిట్ అయింది. అదే రామ్మోహన్ గారు తను మను అని ఏదో సినిమా తీసారు. కానీ అది ఆడలేదు. ఎందుకంటే దానికి బ్రాండింగ్ లేదు. అలాగని పెద్ద సినిమాలకు కూడా అంత రేంజ్‌లో బ్రాండింగ్ ఉండకూడదు. చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ మంచి ఫాంలో ఉన్నారు. చరణ్ సినిమాలో చిరు ఉంటే బాగుంటుంది అనుకుని సినిమా తీసారు. కానీ అది ఆడలేదు. కంటెంట్ బాగోలేకపోతే ఎంత బ్రాండింగ్ ఉన్నా ఏమీ చేయలేం’’ అని వెల్లడించారు.

READ ALSO: