జనసేన-మాయావతి-జేడీ?

Share Icons:

తిరుపతి, మార్చి 18,

ఇటీవలి కాలంలో ఆశ్చర్యం కలిగించిన రాజకీయ పరిణామం ఏమిటంటే… సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేనలో చేరడం.  ఇలా ఆశ్చర్యపోవడానికి నా కారణాలు నాకున్నాయి. మొదటిది- పవన్ కల్యాణ్.. సిద్ధాంతాలు. . విధానాలు పారదర్శకంగా లేకపోవడం. ఆయన పెద్దగా లా అబైడింగ్ తత్వం ఉన్నవాడు కాదని చరిత్ర చెబుతోంది. సినిమాలో ఆదాయానికి ఖచ్చితమైన పన్ను కట్టారా.. అంటే ఇంత వరకూ సమాధానం చెప్పలేదు. పన్ను ఎంతో కొంత కట్టడం వేరు. తన ఆదాయాన్ని ఏ మాత్రం బ్లాక్ చేయకుండా.. అంతా వైటే చూపడం నిజాయితీ… దీనిపైనే ప్రశ్న.

రెండోది- పవన్.. మాయావతిల సయోద్య. మాయావతి పై ఉన్న అవినీతి ఆరోపణల మాటేమిటి. అన్నీ రాజకీయ దురుద్ధేశంతో చేసినవేనా… మాయావతి వద్ద సమకూరిన అపరిమిత సంపదకు మార్గాలు మిటి. అంతా చట్టబద్ద మార్గాల్లో సమకూరిందేనా… మరి పులుకడిగిన ముత్యంగా చెప్పుకునే పవన్ మాయావతితో ఎలా కలుస్తారు. కేవలం కులం వలన వచ్చే బలం కోసం అవినీతిని పట్టించుకోరా… జేడీ ఇందుకేమని సమాధానం చెబుతారో… ? ఇండియాలో.. ప్రజలు వాస్తవం కంటే భావోద్వేగానికే అధికంగా ప్రభావిత మవుతారనే వాదన ఉంది. ఇక్కడా అదే జరుగుతోందా? ప్రజల డబ్బుతో తన విగ్రహాలు భారీ స్థాయిలో ఏర్పాటు చేసుకున్న మాయావతి నైతికతను పవన్, జేడీ సమర్థిస్తారా. కుం ఓట్లున్నాయి కనుక చూసీ చూడనట్టుంటారా.

ఇక జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. భారీగా డబ్బులు ఖర్చుపెట్టకుండా ఎన్నికల్లో గెలవలేమన్న అభిప్రాయం ప్రస్తుతం నెలకొని ఉందని, అయితే, సొమ్ములతో పనిలేకుండానే రాజకీయం చేయొచ్చని నిరూపించే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు.

అది అభిప్రాయం కాదు. వాస్తవం..  డబ్బు లేకుండా రాజకీయం చేసే పరిస్తుతులు లేవు. అలా చేయాలనుకోవడం గొర్రెతోక పట్టుకుని గోదావరిని ఈదడమే అవుతుంది. ప్రజలు మానసికంగా ఓటుకు నోటు తీసుకోవడానికి చాలా కాలం క్రితమే సిద్దపడిపోయారు. అది అవినీతి కాదు నేడు.  అలా మారింది వాతావరణం.

ఇప్పటికే పలు మరకలున్న నేతలతో కలుస్తూ,  వారిని పార్టీలో చేర్చుకుంటూ.. పవన్ సమాజానికిస్తున్న సందేశం ఏమిటి. వైదికలపై చెబుతున్న నీతులకు… ఆచరణలో చేతలకూ నక్కకు నాగలోకానికీ ఉన్నంత వ్యత్యాసం ఉన్నపుడు… పాత కథే పునరావృత్తం అవుతుంది కానీ, జనసేన ప్రత్యేకత  ఏముంటుంది?  పలు పార్టీలకు చెందిన పాత నాయకులను చేర్చుకోవండ ద్వారా జనసేన కొనసాగించే వైవిద్యం ఏమిటన్నదే ఓటరుకు అర్థం కావలసిన విషయం.

 

మామాట: అంటే, అన్నారంటారుగానీ, అన్నీ ఆ తానులోని ముక్కలేగా… 

Leave a Reply