పవన్ రెండుచోట్ల పోటీ…విశాఖ పార్లమెంట్ నుండి జేడీ…

Share Icons:

అమరావతి, 19 మార్చి:

మరి కొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. పార్టీ జనరల్ బాడీ సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో.. వామపక్షాల పొత్తుతో కార్మిక వర్గ ఓటు బ్యాంకును సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు. అలాగే భీమవరంలో 2004 నుంచి వరుసగా మూడుసార్లు కాపు అభ్యర్థులే ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇక్కడ కాపుల హవా మొదలైందని చెబుతారు.

అటు ఇటీవల పార్టీలో చేరిన మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను విశాఖపట్నం నియోజకవర్గం నుంచి పోటీకి దించాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు జేడీ పోటీపై పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చేశారని సాయంత్రం లోపు జేడీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాలం వేస్తున్నారని తెలుస్తోంది. ముద్రగడను కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన తరపున కొందరు నేతలు ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మామాట: సేఫ్ గేమ్ అనమాట

Leave a Reply