సింహం కాస్త చిరంజీవిలా మారిపోతుంది: రామ్ గోపాల్ వర్మ..!!

Share Icons:

హైదరాబాద్, 17 ఫిబ్రవరి:

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో విమర్శలు గుప్పించాడు.

హైదరాబాద్ నొవోటెల్‌లో జనసేన పార్టీని ప్రారంభించిన సమయంలో పవన్ కల్యాణ్ ఓ సింహంలా కనిపించారని, ఆయన మాటలు సింహ గర్జనను తలపించాయని… అయితే, వివిధ వర్గాలకు సంబంధించిన వ్యక్తులను అవి కావాలి, ఇవి కావాలి అని అడుక్కోవడం ద్వారా ఆయన కూడా చిరంజీవిలా మారిపోతున్నారని విమర్శించారు.

చిరంజీవిలా పవన్ కల్యాణ్ మారిపోక ముందే ఏపీ ప్రజలు మేల్కొవాలని… లేకపోతే ప్రజారాజ్యం కన్నా దారుణంగా జనసేన తయారవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలువర్గాల ప్రజలు పవన్ కల్యాణ్ లో చిరంజీవిని చూసుకుంటున్నారని దెప్పి పొడిచారు.

తాజాగా పవన్ కల్యాణ్ లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణను, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులతో చేతులు కలపడం ద్వారా పవన్ కల్యాణ్ మరో ఘనతను సాధించారని ఆయన అన్నారు. ఇకనైనా జనసేన మొత్తం సీట్లలో పోటీ చేయకపోతే.. చిరంజీవి కంటే పెద్ద తప్పు చేసిన వాడవుతారని పవన్‌ను ఉద్దేశించి వర్మ మరో ట్వీట్ చేశారు.

మామాట: దీనిపై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో…

English Summary: Ram Gopal Varma has commented on the Power Star’s progress in politics and his party Jana Sena. The ace filmmaker says that Pawan Kalyan wants to become another Chiranjeevi in politics by trying to please “various sections”.

Leave a Reply