జనసేన గొంతు సరిపోదు.. ఉండవల్లి, జే‌పిలతో కలుస్తా : పవన్

Share Icons:

హైదరాబాద్, 07 ఫిబ్రవరి:

ప్రజా సమస్యలపై పోరాటం చెయ్యడంలో జనసేన గొంతు సరిపోవట్లేదని, ఉండవల్లి, జయప్రకాష్ నారాయణతో కలుస్తానని చోటే భాయ్ పవన్ వ్యాఖ్యానించారు.

బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో ప్రకటించారని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.

విభ‌జ‌న స‌మ‌యంలో యూపీఏ ప్ర‌భుత్వం ఏపీకి న్యాయం చేయ‌లేద‌ని అన్నారు. అలాంటి ప‌రిస్థితుల్లో తాను ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చుతార‌ని, అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉన్న న‌రేంద్ర‌ మోదీ, చంద్ర‌బాబు నాయుడుల‌ను స‌మ‌ర్థించాన‌ని చెప్పారు.

ప్ర‌త్యేక హోదాపై తాను తిరుప‌తి, కాకినాడల్లో స‌భ‌ల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించానని పవన్ కల్యాణ్ తెలిపారు. కొన్ని రోజుల‌కి ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని అన్నారని తెలిపారు.

ప్ర‌త్యేక ప్యాకేజీని టీడీపీ నేత‌లు ఒక‌సారి బాగుందంటారు, ఒక‌సారి బాగోలేద‌ని అంటారని విమ‌ర్శించారు. ఇలా మాట‌ల‌తో చాలా తిక‌మ‌క చేస్తున్నారని, రాష్ట్ర ప్ర‌భుత్వం మీద న‌మ్మ‌కం పోతోందని అన్నారు.

అప్పట్లో తెలంగాణ కోసం అందరూ కలిశారని, లోక్‌సభను స్తంభింపజేశారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు విభజన హామీలను సాధించేందుకు ఓ వేదిక ఉండాలని నిర్ణయింయించినట్టు ఆయన తెలిపారు.

మాజీ మంత్రి ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్‌, లోక్‌స‌త్తా జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ లాంటి వారిని క‌లుసుకుని ముందుకు వెళతానని స్పష్టం చేశారు.

ఉండ‌వ‌ల్లి, జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణలను తాను వ్యక్తిగతంగా కలుస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. జ‌న‌సేన గొంతు స‌రిపోవ‌డం లేదని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెప్పేవాటిలో అస‌త్యాలు ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.

తాను రేపటి బంద్‌కు వ్యతిరేకం కాదని, కాకపోతే శాంతియుతంగా నిరసనలు జరపాలన్నారు. బంద్‌ల పేరుతో మనవాళ్లని మనం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తెలిపారు.

మామాట: చూద్దాం… చోటే భాయ్ ఏం చేస్తాడో….

English summary:

Ending his silence on budget and injustice meted out to AP, Pawan Kalyan has called for a Joint Action Committee (JAC) comprising the intellectuals such as Jayaprakash Narayan, Undavalli Arun Kumar, himself and other like-minded people, groups.

 

Leave a Reply