అందులో ‘పవన్’ వంద శాతం బెటర్ : సీపీఐ నారాయణ

Share Icons:

అమరావతి, మే9 :

సీపీఐ నారాయణ ఏ వ్యాఖ్యలు చేసినా సంచలనమే. ఈ పర్యాయం జగన్ కు వ్యతిరేకంగా పవన్ కు అనుకూలంగా ఆయన వ్యాఖ్యానించడం విశేషం. సీపీఐ జాతీయ నేత కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

సమకాలీన రాజకీయాలపై ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లలో ఎవరు బెటర్ అనే ప్రశ్న ఎదురైనపుడు ఏమాత్రం సందేహించకుండా పవన్ వంద శాతం ఉత్తమమని కుండబద్దలు కొట్టారు.

జగన్ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. అది అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించారు.

బీజేపీతో పవన్‌ కళ్యాణ్‌కు ఎటువంటి సంబంధాలు లేవని చెప్పారు. అందుకే పవన్‌తో సీపీఐ సంబంధాలు పెట్టుకుందన్నారు.

ఆయన అంతటితో ఆగలేదు. నరేంద్ర మోడీపై సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు పెట్టాలన్నారు.

అలాగే, ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మీద కూడా కేసు నమోదు చేయాలన్నారు.

అలాగే అక్రమాస్తుల కేసులో జగన్ మీద చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. ఈ ముగ్గురిపై చర్యలకు ఉపక్రమించే ధైర్యం బీజేపీలో ఏ ఒక్కరికీ లేదని ఆయన ఆరోపించారు.

మామాట : ఇతరులపై పంచులు… పవన్‌కు ప్రశంసలు

2 Comments on “అందులో ‘పవన్’ వంద శాతం బెటర్ : సీపీఐ నారాయణ”

Leave a Reply