అత్యవసర పరిస్థితుల్లో విమానంలో నుండి దూకేసిన ప్రయాణికులు….

అత్యవసర పరిస్థితుల్లో విమానంలో నుండి దూకేసిన ప్రయాణికులు….
Views:
14

వాషింగ్టన్, 13 మార్చి:

అత్యవసర పరిస్థితుల్లో ఓ విమానాన్ని ల్యాండ్ చేయడంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు మామూలుగా కిందకి దిగకుండా, రెక్క పక్కనే ఉండే కిటికిలో నుంచి కిందకి దూకేశారు.

ఈ ఘటన అమెరికాలోని అల్బక్వెర్‌క్యూ అంత‌ర్జాతీయ‌ సన్‌పోర్ట్‌ విమానాశ్రయంలో గ‌త అర్ధ‌రాత్రి అల‌జ‌డి రేపింది.

అరిజోనాలోని ఫోనిక్స్‌ నుంచి బయలుదేరిన డల్లాస్‌కు చెందిన సౌత్‌వెస్ట్‌ విమానం- 3562 లో ఇంజిన్ నుండి ఏదో వాస‌న రావ‌డంతో అల్బక్వెర్‌క్యూ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

అయితే అప్ప‌టికే ఏమవుతుందన్నా కంగారులో ఉన్న ప్ర‌యాణికులు, విమానం ల్యాండ్ చేయ‌గానే విమానం కిటికిలో నుంచి కిందకి దూకేశారు.

విమానం ల్యాండ్ కాగానే విమాన సిబ్బంది అత్య‌వ‌స‌ర ద్వారం తెరిచి ప్రయాణికులంతా వెంటనే కిందకి దిగేయాలని విమాన సిబ్బంది సూచించినట్లు సమాచారం.

దీంతో ప్ర‌యాణికులు అంద‌రూ ఒక్క‌సారిగా దూకేశారని, వారంతా త్వ‌ర‌గా విమానం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డంతో ప్రమాదం తప్పిందని సంబంధిత అధికారులు చెప్పారు. అయితే సుమారు ఎనిమిది అడుగుల ఎత్తునుంచి ప్ర‌యాణికులు దూకేయ‌డంతో వారిలో ఇద్దరికి గాయాల‌య్యాయి.

మామాట: ప్రాణం మీదకొస్తే అంతేలే…

English summary:

A Dallas-bound flight made an emergency landing at Albuquerque International Sunport, sending panicked passengers leaping from a wing onto the tarmac after crew members screamed at them to get away from the aircraft, passengers and officials said.

(Visited 11 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: