పార్వతీపురంలో పాగా వేసేదెవరో?

Share Icons:

విజయనగరం, 5 ఏప్రిల్:

గత ఎన్నికల్లో పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. రానున్న ఎన్నికల్లో ఈ స్థానాన్ని ఏ విధంగానైనా దక్కించుకోవాలని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పొందిన జమ్మాన ప్రసన్నకుమార్‌ను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ప్రసన్నకుమార్‌ను నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పించి బొత్స సత్యనారాయణ కుటుంబంతో ఒకరిగా ఉంటున్న అలజంగి జోగారావును స్థానంలో నియమించారు.అంతేకాకుండా నియోజవర్గ టికెట్‌ను కూడా ఆయనకే కేటాయించారు.

టీడీపీ నుంచి బొబ్బిలి చిరంజీవులు పోటీ చేయనున్నారు. ప్రస్తుతం టీడీపీలో బలిజిపేట, సీతానగరం మండలాల్లో రెండు గ్రూపులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు గ్రూపులు ఆ పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయడం అన్నది సందేహంగా ఉంది. ఇక వైసీపీలో కూడా జోగారావు నియామకం తరువాత పార్వతీపురం పట్టణం, మండలంలోరెండు గ్రూపులుగా చీలిపోయింది. దీంతో టీడీపీ-వైసీపీ అభ్యర్ధుల మధ్య టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది.

మామాట: పార్వతీపురంలో ఈ సారి ఏ జెండా ఎగురుతుందో

Leave a Reply