గుంటూరులో జనసేన ఆఫీసు ఖాళీ…బారుకు అద్దెకు ఇవ్వనున్న యజమాని

Share Icons:

 

గుంటూరు:

ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఆ పార్టీ ఆఫీసులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అయ్యింది. నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న పార్టీ  కార్యాలయాన్ని ఖాళీ చేసి యజమానికి కార్యాలయ భవనాన్ని తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా భవన యజమాని టూలెట్ బోర్డును పెట్టాడు.

అయితే ఈ భవనాన్ని బార్ అండ్ రెస్టారెంట్ కు అద్దెకిస్తామని యజమాని పేర్కొనడం గమనార్హం. ఈ సంవత్సరం మార్చిలో ఎన్నికలకు ముందు  ఈ బిల్డింగ్‌లో జనసేన, తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది.

ఎన్నికలకు ముందు రావెల కిషోర్‌ బాబు తెలుగుదేశం పార్టీని వీడి, జనసేనలో చేరిన తరువాత, ఆయనే ఈ భవనాన్ని పార్టీ కార్యాలయంగా ప్రారంభించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరాజయం తరువాత, రావెల ఈ ఛాయలకు కూడా రాలేదు. ఆయన బీజేపీలో చేరిపోయారు.

 

Leave a Reply