హైకోర్టు లో పరిపూర్ణానంద పిటిషన్

హైకోర్టు లో  పరిపూర్ణానంద పిటిషన్
Views:
11

హైదరాబాద్‌, జూలై 11,  హైదరాబాద్ నగరం నుంచి పోలీసులు తనను బహిష్కరించడాన్ని నిరసిస్తూ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద  హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ పరిపూర్ణనంద బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ ధాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీస్ శాఖ విస్మరిస్తోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తక్షణమే బహిష్కరణను తొలగించేలా పోలీస్ శాఖకు అదేశాలు ఇవ్వాలని పరిపూర్ణనంద స్వామి పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించలేదు.

శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను  కత్తి మహేశ్‌ను కూడా హైదరాబాద్‌ నుంచి బహిష్కరించారు. ఆరు నెలల పాటు నగరంలోకి రాకుండా నిషేధం విధించారు.

స్వామి పరిపూర్ణానందను తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కరణ చేయడంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు బుధవారం ట్వీటర్‌లో స్పందించారు. నిజాం మత రాజకీయాలకు కేసీఆర్‌ ప్రభుత్వ పరిపాలన నిదర్శనమని ధ్వజమెత్తారు. పరిపూర్ణానంద బహిష్కరణ మానవహక్కుల ఉల్లంఘన అని విమర్శించారు. ఇది యూవత్‌ హిందూ సమాజంపై దాడి అని, ప్రభుత్వం ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు పెద్దపీఠ వేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.

ఎమ్‌ఐఎమ్‌ నేతలను బహిష్కరించాలి:

పరిపూర్ణానంద నగర బహిష్కరణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ కోరారు. కోట్లాది ప్రజలు ఆరాధించే శ్రీరాముడిని నిందించిన వారిపై చర్యలేవని, ఈ ప్రభుత్వం ఎవరి చేతిలో నడుస్తోందని ప్రశ్నించారు. ఆయన నగర బహిష్కరణ ప్రభుత్వ కుట్రని అన్నారు. హిందూ దేవుళ్లను తూలనాడిన ఎమ్‌ఐఎమ్‌ నేతలను బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. స్వామిజీని బహిష్కరణ చేయడమంటే హిందూవులను బహిష్కరణ చేయడమే అని మండిపడ్డారు. పరిపూర్ణానందపై చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఆయపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

మామాట : స్వాములకు భక్తి కంటే రాజకీయాలు ఎక్కువైనాయనిపిస్తోంది.

(Visited 15 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: