TRENDING NOW

ఢిల్లీ రండి స్వామీ…!

ఢిల్లీ రండి స్వామీ…!
Views:
13

కొత్తఢిల్లీ, అక్టోబర్ 18,

అయ్యా, ఢిల్లీ రండి మాట్లాడుకుందాం.. అంటూ శ్రీ పీఠం అధిపతి, పరిపూర్ణానందకు మరోసారి పిలుపు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమవుతారు. కుదిరితే ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుసుకుంటారు. త్వరలోనే రాజకీయంగా పరిపూర్ణానందకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైందని సమాచారం. దక్షిణాది రాష్ట్రాల ప్రచార సారధిగా ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని  పార్టీవర్గాలు తెలిపాయి.

కాగా, పక్షం రోజుల క్రితం పరిపూర్ణానంద న్యూఢిల్లీలో అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా రాజకీయ పరిస్థితులపై ఇరువురూ చర్చించారు. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్ధిగా పరిపూర్ణానందను ప్రకటించే అవకాశముందని అప్పట్లో ప్రచారం జరిగింది.  అయితే, అమిత్ షా ఆదేశాల మేరకు భవిష్యత్ కార్యక్రమాలుంటాయని సమావేశానంతరం పరిపూర్ణానంద తెలిపారు. తన ఆసక్తి ప్రధానం కాదని, అమిత్ షా ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల ప్రకారం ప్రచార కార్యక్రమాలుంటాయని చెప్పారు. శరన్నవరాత్రుల తర్వాత మళ్లీ కలుద్దామని అప్పట్లో అమిత్ షా సూచించారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ పరిపూర్ణానంద ఢిల్లీ వెళ్తున్నారు.

మామాట: స్వాములకు రాజకీయాలు బాగా వంటబడుతున్నట్టున్నాయ్

(Visited 23 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: