వరల్డ్ కప్‌లో ఓపెనర్లుగా రోహిత్, పంత్…!

Share Icons:

దుబాయ్, 14 ఫిబ్రవరి:

మే 30 నుండి వర్లడ్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్‌లో ఆడబోయే టీమిండియాకు ఆసీస్ మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ సరికొత్త సలహాలు ఇచ్చాడు. రోహిత్ శర్మకు తోడుగా… శిఖర్ ధావన్‌ బదులు… రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా దించాలని చెబుతున్నాడు.

శిఖర్ ధావన్ చక్కగా ఆడతాడు అంటూనే, టీంఇండియాకి కలిసి రావాలంటే పంత్ ఓపెనర్‌గా ఉండాలన్నాడు. ఇలాంటి ట్రిక్స్ ద్వారా, ప్రత్యర్థి జట్లను కన్‌ఫ్యూజ్ చేసి… విజయం సాధించవచ్చన్నాడు. అందులో భాగంగా వరల్డ్ కప్ కంటే ముందుగా జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌లో పంత్‌ని ఓపెనర్‌గా దించి, అతడు ఎలా ఆడుతున్నదో గమనించాలని సూచించాడు.

అయితే భారత్ జట్టులో చాలా మంది ప్లేయర్లు చాలా రోల్స్ ప్లే చెయ్యగలరన్న వార్న్… ఎవర్ని ఎక్కడ దింపినా పెద్దగా సమస్య ఉండదన్నాడు.  ఇక  జట్టులో ధోనీ లాంటి వాళ్ల సేవలు అత్యవసరమన్నాడు. 4, 5, 6 ఏ పొజిషన్‌లో దిగినా, మ్యాచ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా… ధోనీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశాడన్న షేన్ వార్న్… ఓవర్‌కి 10 రన్స్ కూడా చేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశాడు.

మామాట: మరి వార్న్ సలహాలు భారత్ పాటిస్తుందో లేదో చూడాలి…

Leave a Reply