ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తున్న సాన్యో, జేవీసీ స్మార్ట్‌టీవీలు…

Share Icons:

ముంబై, 17 జూన్:

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు దిగ్గజం పానాసోనిక్‌కు చెందిన సబ్‌బ్రాండ్ సాన్యో.. రెండు నూతన ఫుల్‌హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. 32, 43 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో లభించే వీటిల్లో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఆండ్రాయిడ్ మిర్రరింగ్ తదితర ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నారు.

అలాగే 896 మెగాహెడ్జ్ సీపీయూ, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, ఆర్‌జే-45, హెడ్‌ఫోన్ అవుట్‌పుట్ పోర్టులు తదితర ఫీచర్లను ఈ టీవీల్లో అందిస్తున్నారు. ఇక 32 ఇంచుల టీవీ ధర రూ.12,999 ఉండగా, 43 ఇంచుల టీవీ ధర రూ.22,999గా ఉంది. వీటిని వినియోగదారులు అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీదారు జేవీసీ భారత మార్కెట్‌లో 6 నూతన ఎల్‌ఈడీ టీవీలను తాజాగా విడుదల చేసింది. 24 నుంచి 39 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌లలో ఈ టీవీలు విడుదలయ్యాయి. వీటి ప్రారంభ ధర రూ.7,499గా ఉంది. కాగా ఈ సిరీస్‌లో విడుదలైన జేవీసీ 32ఎన్3105సి మోడల్ టీవీ ధర రూ.11,999 ఉండగా ఇందులో 1 జీబీ ర్యామ్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేశారు.

మిరాక్యాస్ట్ స్క్రీన్ క్యాస్టింగ్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు, వైఫై తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక ఈ టీవీల గరిష్ట ధర రూ.16,999 గా ఉంది.

 

Leave a Reply