అదిరిపోయే ఫీచర్లతో 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీలను విడుదల చేసిన పానాసోనిక్…..

Panasonic 4K Ultra HD Smart TV released in india
Share Icons:

ముంబై:

 

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానాసోనిక్ 14 నూతన మోడల్ 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీలను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. వీటిల్లో ఐపీఎస్ ప్యానెల్, 4కె డిమ్మింగ్, డాల్బీ అట్మోస్, గూగుల్/అలాక్సా సపోర్ట్ తదితర ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నారు. కాగా ఈ టీవీల ప్రారంభ ధర రూ.50,400 మొదలుకొని గరిష్టంగా రూ.2,76,900 వరకు ఉంది.

 

ఇక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు టీసీఎల్ భారత్‌లో ఓ నూతన 4కె ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ టీవీని విడుదల చేసింది. 55 ఇంచుల డిస్‌ప్లే సైజుతో పీ8ఈ 4కె ఏఐ మోడల్ పేరిట ఈ టీవీని టీసీఎల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. కేవలం రూ.40,990 ధరకే ఈ టీవీని వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. వాయిస్ కమాండ్ల ద్వారా టీవీని కంట్రోల్ చేయవచ్చు. దీంట్లో క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ గేమ్స్, యాప్స్‌ను కూడా ఇందులో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

 

శాంసంగ్ సేల్…

 

దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వెబ్‌సైట్‌లో శాంసంగ్ ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నది. సేల్‌లో గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ రూ.1వేయి తగ్గింపు ధరతో రూ.13,990 ప్రారంభ ధరకు లభిస్తున్నది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం20పై కూడా రూ.1వేయి తగ్గింపు ధరను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.11,990 ప్రారంభ ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే గెలాక్సీ ఎం40 ఫోన్‌పై రూ.7800 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

Leave a Reply