తిరుపతి టిడిపి ఎంపి అభ్యర్ధిగా పనబాక లక్ష్మి

Share Icons:

నెల్లూరు, మార్చి 18,

సోమవారం నెల్లూరులో జరిగిన ప్రచార సభలో కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి దంతులు  చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. అనంతరం పనబాక లక్ష్మి పేరును తిరుపతి టిడిపి ఎంపి అభ్యర్థిగా సిఎం చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు.

ఇదే సమయంలో ఆదాల ప్రభాకర్‌ రెడ్డి గురించి ఆయన మాట్లాడుతూ.. ఆదాలని చూస్తే అసహ్యం వేస్తుందని, ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే పక్క పార్టీతో లాలూచీ పడ్డారని సిఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీకి ద్రోహం చేశారని, వీరికి ప్రజలే బుద్ది చేప్పాలన్నారు.

మామాట: బుద్ది చెప్పడం ప్రజలకు తెలుసు… నాయకులకే తెలియదు..

Leave a Reply