పాన్-ఆధార్ అనుసంధానం మార్చి 31 వరకు..

Share Icons:

న్యూఢిల్లీ, 8 డిసెంబర్:

పాన్-ఆధార్ కార్డుల అనుసంధానం ఈ నెల 31 ముగింపు గడువు.

కానీ దీనిపై ఈరోజు స్పందించిన కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ పాన్‌-ఆధార్‌ లింక్ గడువును మాత్రమే మూడు నెలల పాటు పొడిగించింది.

ఈ గడువు మార్చి 31, 2018 వరకు  ఉంటుంది.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, 2017 జులై 31 లోగా పన్ను చెల్లింపుదారులు తమ శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను ఆధార్‌ నంబర్‌తో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ అనుసంధాన ప్రక్రియలో అనేక సమస్యలు రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మొదట ఈ గడువును ఈ సంవత్సరం ఆగస్టు 31 వరకు పెంచగా. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. అయినా ఇంకా చాలామంది తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేకపోయారు. దీంతో చివరగా మరో అవకాశం కల్పిస్తూ గడువును 2018 మార్చి 31వరకు పొడిగిస్తున్నామని ఆర్థికశాఖ ప్రకటించింది. కేవలం ఇది పాన్- ఆధార్ తో అనుసంధానికి మాత్రమే అని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 33కోట్ల మంది పాన్‌ ఖాతాదారుల్లో కేవలం 13.28కోట్ల మంది నవంబర్‌ వరకు తమ పాన్‌ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.

మామాట: మరి పాన్ కార్డు ఉన్నవారంతా త్వరగా ఆధార్ లింక్ చేసుకుంటే మంచిది..

Leave a Reply