పాలకుర్తిలో టీఆర్ఎస్‌కి షాక్: కాంగ్రెస్‌లో చేరిన ఎర్రబెల్లి ముఖ్య అనుచరుడు….

errabelli-dayakar-rao-about-his-party-change
Share Icons:

పాలకుర్తి, 22 అక్టోబర్:

తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తూ ఇతర పార్టీలలో చేరుతున్నారు.  ఈ క్రమంలోనే టీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అనుచురుడు కాంగ్రెస్‌లో చేరారు. 

చెర్లపాలెం ఎంపిటీసీ అయిన అనుమాండ్ల నరేందర్ రెడ్డి థరూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక రెండో విడత కూడా ఆయనకే ఆ పదవిని ఇచ్చారు. అయితే నరేందర్ రెడ్డి తన అనుచురులతో కలిసి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 

కాగా, నరేందర్ రెడ్డి చాలా కాలంగా దయాకర్ రావుతో ఉంటూ వస్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు కూడా. పాలకుర్తిలో నరేందర్ రెడ్డి చేరిక కాంగ్రెసుకు బలాన్నిస్తుందని భావిస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి అయిన జంగా రాఘవరెడ్డిని ఎదుర్కోవడం దయాకర్ రావుకు తలకు మించిన భారమవుతుందని అంటున్నారు. 

మామాట: ఎర్రబెల్లిని ఓడించడానికి బాగానే ప్రయత్నిస్తున్నారు…

Leave a Reply