పాలకొల్లులో పైచేయి ఎవరిదో?

Share Icons:

పాలకొల్లు, 22 మార్చి:

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరోసారి బరిలో ఉండగా…మొన్నటివరకు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న డాక్టర్ బాబ్జీ వైసీపీ నుండి పోటీ చేస్తున్నారు. గుణ్ణం నాగబాబు జనసేన నుండి పోటీకి దిగుతున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల ఈ ఐదేళ్లు ఇక్కడ అభివృద్ధి బాగానే చేశారు. అటు సంక్షేమానికి కూడా పెద్ద పీట వేస్తూ ముందుకు సాగారు. అయితే మొన్నటివరకు టీడీపీతో ఉన్న బాబ్జీ వైసీపీలోకి వెళ్ళడం కొంచెం ఇబ్బందే.

అటు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న సీనియర్ నేత బాబ్జీకి గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండటంతో నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఇక వైసీపీ టికెట్ ఆశించి అసంతృపితో నాగబాబు జనసేనలో చేరడం పార్టీకి ఇబ్బందికరం. జనసేన నుండి పోటీ చేస్తున్న నాగబాబు కూడా నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఇక్కడ చిరంజీవి, పవన్ అభిమానులు ఎక్కువ ఉండటం వారికి కలిసొస్తుంది. కానీ వైసీపీ, టీడీపీ అంత స్ట్రాంగ్‌గా జనసేన లేదు.

కాగా, ఇక్క‌డ కాపు సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా బ‌లమైన‌ది, వైశ్య‌సామాజిక‌ వ‌ర్గం రాజ‌కీయంగా ఆర్ధికంగా బలంగా ఉంది. అయితే కాపు ఓటర్లు గెలుపోటములని ప్రభావితం చేయనున్నాయి. మరి చూడాలి ఈసారి పాలకొల్లులో ఎవరు పైచేయి సాధిస్తారో.

మామాట: చిరంజీవి సొంత నియోజకవర్గం ఈసారి ఎవరి సొంతమవుతుందో

Leave a Reply