ఇండియాలో పాక్ సానుభూతిపరులు ఉన్నారు…మమతా కూడా

Pakistani commentator identifies Arundhati Roy, Mamata Banerjee and Congress as sympathisers
Share Icons:

ఇస్లామాబాద్:

 

ఇండియాలో చాలామంది పాకిస్తాన్ సానుభూతి పరులు ఉన్నారని పాకిస్థాన్ సీనియర్ రాజకీయ నాయుకుడు ముషాహిద్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జియో టీవీలో ప్రసారమైన ఆయన మాట్లాడినా వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియాలో పాకిస్థాన్ సానుభూతిపరులు ఎందరో ఉన్నారని చెప్పారు. అలాగే ఇందులో పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించడమే ఇందుకు కారణం. ఇండియాలోని అందరూ ప్రధాని నరేంద్ర మోదీ వెంటలేరని, వందలాది మంది పాక్ కు మద్దతిచ్చేవారున్నారని ఆయన అంటున్నారు.

 

ఇండియన్స్ అందరూ మోదీతోనే లేరని, రచయిత అరుంధతీ రాయ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో ఎందరో పాక్ సానుభూతిపరులుగా ఉన్నారని ఆయన అన్నారు. ఇండియాతో జరుగుతున్నది దీర్ఘకాలిక యుద్ధమని, ఓ పెద్ద దేశమైన ఇండియాలో ఎంతో మంది ప్రజలు పాక్ వైపున్నారని ఆయన అన్నారు.

 

ఇదిలా ఉంటే కశ్మీరుపై భారత్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా భద్రతా మండలితో పాటు ముస్లిం ప్రపంచం నుంచి మద్దతు సంపాదించడం తేలికేం కాదని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి మహమూద్‌ ఖురేషి స్పష్టం చేశారు. పిచ్చోళ్లలా ఆలోచించవద్దని పాకిస్థానీలకు హితవు పలికారు. భద్రతా మండలి మద్దతు సంపాదించాలంటే కొత్త పోరాటం చేయాలని సూచించారు. పీవోకేలోని ముజఫరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Leave a Reply