పాక్ మాజీ ప్రధానిపై జీవితకాల నిషేధం…!

Share Icons:

ఇస్లామాబాద్, 13 ఏప్రిల్:

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ కు అక్కడి సుప్రీం కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనని భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించింది.

పాకిస్థాన్ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడే భాగంలో ఆయనని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం సరైనేదే అని చీఫ్ జస్టిస్ సాఖిబ్ నిసార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇక షరీఫ్‌తోపాటు పాకిస్థానీ తెహ్రీకె ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ప్రధాన కార్యదర్శి జహంగీర్ తరీన్‌పై కూడా జీవితకాల నిషేధం విధించారు. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్) ప్రకారం వారిద్దరిని జీవితకాలం నిషేధించారు. ఇక ఈ చరిత్రాత్మక తీర్పు పాక్ రాజకీయ వ్యవస్థపై పెద్ద ఎత్తున ప్రభావం చూపనుందని భావిస్తున్నారు.

కాగా, పనామా పేపర్ల కేసుకు సంబంధించి షరీఫ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించకపోవడంతో జస్టిస్‌ అసిఫ్‌ సయీద్‌ ఖోసా నేతృత్వంలోని పాక్‌ సుప్రీం బెంచ్‌ గత ఏడాది జులై 28న నవాజ్‌ను అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ఇక తాజా ఉత్తర్వుల ప్రకారం షరీఫ్ ని జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది.

మామాట: దీంతో పాక్ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వస్తుందో..?

English summary:

In a verdict that has brought down curtains on former Pakistan premier Nawaz Sharif’s political career, the Supreme Court on Friday ruled that disqualification of any member of parliament or a public servant under Article 62 was for life, Dawn reported.

Leave a Reply