ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్: భారత్ సినిమాలపై నిషేధం విధించిన పాక్

Pakistan bans Indian films
Share Icons:

ఇస్లామాబాద్:

 

జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370కు రద్దుకు నిరసనగా పాకిస్తాన్ కొన్ని చర్యలకు ఉపక్రమించింది. నిన్న భారత్ తో దౌత్య, వాణిజ్య సంబంధాలును తెంచుకుటున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పాక్ లో భారత రాయబారి అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించింది. తాజాగా భారత సినిమాలను తమ దేశంలో ప్రదర్శించకుండా నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ తెలిపింది.

 

ప్రస్తుతం ప్రదర్శిస్తున్న బాలీవుడ్ సినిమాలను వెంటనే నిలిపివేయాలనీ, అలాగే కొత్త సినిమాలను కూడా తాము అనుమతించబోమని పాక్ ప్రధాని ప్రత్యేక సహాయకుడు డా. ఫిరదౌస్ అషిక్ అవాన్ చెప్పారు. అయితే పాక్ థియేటర్లకు 70 శాతం ఆదాయం భారతీయ సినిమాల ద్వారానే వస్తోంది. గతేడాది అక్కడ 21 పాకిస్థానీ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం ఒక్కో బాలీవుడ్ సినిమా పాక్ లో రూ.3 నుంచి 4 కోట్ల వరకూ అర్జిస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా రూ.37 కోట్ల కలెక్షన్ తో పాకిస్థాన్ లో టాప్ గా నిలిచింది.

 

అలాగే ఇరుదేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత్, పాకిస్థాన్ ల మధ్య నడిచే ఈ రైలు ఇరుదేశాల ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది. పాక్ తీవ్ర నిర్ణయంతో వాఘా-అటారీ బోర్డర్ వద్ద వందలాది ప్రయాణికులు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.

Leave a Reply